in

Faria Abdullah: i Would Date Pawan Kalyan, Marry Prabhas

జాతిరత్నాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, తన నటనతో గుర్తింపు పొందిన ఫరియా అబ్దుల్లా, సుమ అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఈ సందర్భంగా, “మీకు అవకాశం వస్తే ఎవరితో డేటింగ్ చేస్తారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు?” అని సుమ ప్రశ్నించగా, ఫరియా బదులిస్తూ, “నాకు అవకాశం వస్తే పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ చేస్తాను, ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటాను” అని తడుముకోకుండా సమాధానమిచ్చింది.

ఫరియా వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అటు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇటు ప్రభాస్ అభిమానులు వాటిని విస్తృతంగా షేర్ చేస్తూ తమ స్పందనలను తెలియజేస్తున్నారు. తమ అభిమాన నటుల ప్రజాదరణకు ఇది నిదర్శనమని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఫరియా తన కెరీర్‌ను డ్యాన్సర్‌గా ప్రారంభించి, ఆ తర్వాత నటనపై ఆసక్తితో ‘జాతిరత్నాలు’ సినిమా ఆడిషన్‌కు హాజరయ్యారు. ఆ చిత్రంలోని ‘చిట్టి’ పాత్ర ద్వారా ఆమె విస్తృత ప్రజాదరణ పొందారు..!!

happy birthday sundeep kishan!

Trisha Opens Up About Early Career Conditions with mother!