రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలతో ఆమె జోడి కట్టింది. మలయాళంలో టోవినో థామస్ తో కలిసి ‘ఐడెంటిటీ’ సినిమాలోనూ చేసింది. అయితే ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర ఆమెకి విమర్శలను తెచ్చిపెట్టింది. అఖిల్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది జనవరి 2వ తేదీన థియేటర్లకు వచ్చింది. రీసెంటుగా ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమా చూసిన తెలుగు అభిమానులు, ఈ పాత్రకి ఓకే చెప్పడం త్రిష చేసిన పొరపాటు అనే అంటున్నారు..
సెకండ్ ఇన్నింగ్స్ లోను త్రిష క్రేజ్ .. ఆమె అందుకునే పారితోషికం మామూలుగా లేవు. అలాంటి పరిస్థితుల్లో ఆమె ‘ఐడెంటిటీ’ చేసింది. టోవినో థామస్ పెద్ద హీరో అయినప్పటికీ, ఆ సినిమాలో అతని ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగంగా మాత్రమే త్రిష కనిపిస్తుంది. హంతకుడిని చూసిన ఆమె, అతని పోలికలను పోలీసులకు చెప్పడమే ఆ పాత్ర పని. ఏ మాత్రం విషయం లేని ఆ పాత్రకు త్రిష ఎలా ఒప్పుకుందంటూ ఫ్యాన్స్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రీసెంటుగా అజిత్ తో ఆమె చేసిన ‘పట్టుదల’ సినిమా కూడా ఫ్లాప్ కావడం పట్ల వాళ్లు మరింత అసంతృప్తితో ఉన్నారు..!!