
దర్శకదీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేరకేక్కిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గిరిజన వీరుడు కొమరం భీం , మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. ఇక రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తరవాత ఈసినిమా చేయబోతున్నారని అందర్లోను ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రాజమౌళి కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మరి చక్కర్లు కొడుతుంది. త్వరలో జక్కన రామాయణాన్ని తెరకెక్కించబోతున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో రాజమౌళి మేక్ రామాయణ అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ‘రామాయణం’ సీరియల్ ను ఈ లాక్ డౌన్ సమయంలో దూరదర్శన్ రీ-టెలీకాస్ట్ చేసిన విషయం తెలిసిందే. మూడు దశాబ్దాల తరవాత కూడా ఈ సీరియల్ ను భారత ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఈ సీరియల్ కారణంగా దూరదర్శన్ ఎప్పుడూ లేని విధంగా టీఆర్పీలో అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 77 మిలియన్ల మంది ‘రామాయణం’ను వీక్షించారు. దాంతో రాజమౌళి రామాయణం కథను తెరకెక్కించబోతున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. మరి ఈవార్తలపై జక్కన క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

