in

fake news spread against rakul!

కుల్ ప్రీత్ సింగ్ లాక్ డౌన్ సమయంలో తన తల్లిదండ్రులతో కలిసి గడుపుతోంది. యోగా చేస్తూ.. డైట్ గురించి తన అభిమానులకు విస్తరిస్తూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంది. లాక్ డౌన్ ఉన్నా కూడా రకుల్ ప్రీత్ సింగ్ బయటకు రావాల్సి వచ్చింది. ఇంతకూ రకుల్ బయటకు రావడానికి కారణం మందులు తీసుకుని వెళ్లడం కోసం.

ముంబై లోని బాంద్రాలో ఉన్న మెడికల్ షాపు కి వెళ్లి మందులు తీసుకొని రోడ్డు దాటుతుండగా, ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాని రకుల్ చేతిలో ఉన్నవి మద్యం బాటిల్స్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. మెడికల్ షాపు ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ కొందరు కావాలనే.. రకుల్ చేతిలో ఉన్నవి మద్యం బాటిల్స్ అంటూ ప్రచారం మొదలుపెట్టింది.

ఒక టీ షర్ట్.. బ్లాక్ కలర్ ప్యాంటు వేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ మెడికల్ షాప్ నుండి బయటకు వచ్చింది. ముఖానికి మాస్క్ కూడా వేసుకుని ఉంది. హాయ్ మేడమ్.. హాయ్ మేడమ్.. అంటూ కొందరు ఆమెను పిలవగా.. చేతులు ఊపుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.

‘nishabdam’ movie direct ott release?

celebrities respond to Vizag gas leak incident!