in

Fahadh Faasil whopping remuneration shocks tollywood producers!

మ‌ల‌యాళ డబ్బింగ్ సినిమాల‌తో తెలుగులోనూ పాపులారిటీ తెచ్చుకొన్న న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్‌. ‘పుష్ప‌’ తో త‌న‌ని తెలుగులోకి తీసుకొచ్చారు. ‘పుష్ప‌’ లో ఫ‌హ‌ద్ చేసిన పాత్ర‌కు మంచి మైలేజీ వ‌చ్చింది. దాంతో తెలుగు నుంచి త‌న‌కు ఆఫర్లు వ‌రుస క‌ట్టాయి. ఆర్కా మూవీస్ లో ‘డోన్ట్ ట్ర‌బుల్ ద ట్ర‌బుల్‌’ సినిమా చేస్తున్నాడు. అది మిన‌హా..తెలుగులో ఫ‌హ‌ద్ ఒప్పుకొన్న సినిమాలేం లేవు. `పుష్ప‌`లో త‌న పాత్ర‌కు అంత పేరొచ్చినా, నిర్మాత‌లు వ‌రుస క‌డుతున్నా ఫ‌హ‌ద్ తెలుగులో న‌టించ‌క‌పోవ‌డానికి కార‌ణం..పారితోషిక‌మే.

ఫ‌హ‌ద్ తెలుగు చేయ‌డానికి రెడీనే. కాక‌పోతే కండీష‌న్లు అప్లై. విల‌న్ పాత్ర‌ల కోసం రూ.15 నుంచి రూ.20 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నాడ‌ని టాక్‌. అంత ఇచ్చుకోలేక‌.. నిర్మాత‌లు వెనుకంజ వేస్తున్నారు. ఆమ‌ధ్య అనిల్ రావిపూడి సినిమాలో పాత్ర కోసం ఫ‌హ‌ద్ ని ఎంచుకొందామ‌నుకొన్నారు. కానీ పారితోషికం విష‌యంలో ఫ‌హ‌ద్ పట్టుద‌ల‌కు పోవ‌డంతో ఆ నిర్ణ‌యం మార్చుకొన్నారు. ఆ స్థానంలోనే క‌ల్యాణ్ రామ్ వ‌చ్చి చేరాడు. మొన్నామ‌ధ్య రామ్ సినిమా లో విల‌న్ పాత్ర కోసం కూడా ఫ‌హ‌ద్ ని సంప్ర‌దించారని టాక్‌. పారితోషికం ద‌గ్గ‌ర మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు..!!

MAA president manchu Vishnu Gives a strong counter to mla!