ఇప్పుడు హిందీ మార్కెట్లో తనంటే ఏంటో రుజువు చేసుకోవడానికి సిద్ధమయ్యాడు ఫహద్ ఫాసిల్. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రూపొందే లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇప్పుడు ఈ హీరోకి జోడిగా బాలీవుడ్ హీరోయిన్ ఎంపిక చేసినట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. నిజంగా ఆ కాంబో ఎవరు ఊహించనిది అని చెప్పాలి. ఆ హీరోయిన్ మరెవరో కాదు..
యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి. ఈమెను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. విండో సీట్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఇంతియాజ్ స్వీయ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందుతుందట. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నిజంగా ఇది షాకింగ్ కాంబినేషన్, అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్స్. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఫహద్, త్రిప్తి డిమ్రి ల కాంబో ఎలా ఉంటుందో చూడాలి మరి..!!