F2 సినిమా చేయడం వల్ల కావొచ్చు వెంకీ, వరుణ్‌ల మధ్య మంచి అండర్‌స్టాండింగ్ కుదిరింది. వెంకీ, వరుణ్‌ల వల్ల కాదు కానీ హీరోయిన్లు (తమన్నా, మెహరీన్)ల వల్లే ఎక్కువ సమస్యలు వచ్చాయి (నవ్వుతూ). ‘ఎఫ్ 2’లో కన్నా ‘ఎఫ్ 3’లో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు. దాదాపు 35మంది ఉన్నారు. రీసెంట్‌గా క్లైమాక్స్‌ను షూట్ చేశాం. అప్పట్లో ఈవీవీగారు సినిమాలో ఎక్కువమంది ఆర్టిస్టులను ఎలా మ్యానేజ్ చేసేవారా అని కొన్నిసార్లు అనిపించింది.
ఇటీవల వెంకీగారు ఫస్టాఫ్ చూసి, ‘నేను ఒక్కడినే బాగా చేశాననుకున్నాను.. ఇదేంటమ్మా అందరూ ఇరగ్గొట్టేశారు’ అన్నారు. ‘ఎఫ్ 2’ చివర్లో కనిపించిన నేను ‘ఎఫ్ 3’లో ఓ సాంగ్‌లో కనిపిస్తా..ప్యాన్ ఇండియా అంటే ఆ స్థాయిలో కథ రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ (టాలీవుడ్) కుర్చీలో బాగున్నాను. ఒక ఏడాది అక్కడికి (బాలీవుడ్) వెళ్తే ఇక్కడున్న కుర్చీ సంగతి ఏంటి? ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటారు (నవ్వుతూ..). ‘ఎఫ్ 3’ చిత్రంలో పాన్ ఇండియన్ కంటెంట్ ఉంటుంది.