FACT 01:
యస్వీఆర్ గారికి సినిమా అవకాశాలు అంతగా లేని రోజుల్లో అతను భార్య అతనుమీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయేది. ఆమెకు ఇష్టమొచ్చినప్పుడు తిరిగి రమ్మనీ, తమకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చేవారు.
FACT 02:
కొన్ని చిత్రాలకు అతను దర్శకత్వం వహించారు. ముఖ్యంగా అతను దర్శకత్వం వహించిన ‘చదరంగం’ ఇంక ‘బాంధవ్యాలు’ ఈ రెండు చిత్రాలకు ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది
FACT 03:
ఎస్వీయార్ నటించిన ‘నర్తనశాల’ ఇండొనేషియాలోని జకార్తాలో ఆఫ్రో-ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవములో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకు గాను ఎస్వీయార్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందారు.
FACT 04:
వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. ఆయన ఇష్టదైవం శివుడు. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాతే దినచర్య ప్రారంభించే వాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నోఉండేవి.
FACT 05:
ఆయన గొప్ప దాత. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్నివిరాళాలు ఇచ్చారు. చైనాతోయుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలోపదివేల రూపాయలు విరాళం ఇచ్చారు. పాకిస్తాన్‌తోయుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నోసభలు నిర్వహించి, మిగతా నటులతోకలసిఎన్నోప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును దేశ రక్షణ నిధికి ఇచ్చిన గొప్ప మనస్కుడు.