in

entertainment king sree vishnu in sharwanand’s NNNM!

ర్వానంద్ హీరోగా రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ సినిమా టీజర్ మరియు ఇతర ప్రమోషన్స్ కి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది. ‘ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్’ శ్రీవిష్ణు కూడా ఈ చిత్రంలో భాగమని చిత్రబృందం తాజాగా క్లారిటీ ఇచ్చింది. స్పెషల్ ఎనౌన్స్ మెంట్ అంటూ శ్రీవిష్ణు కార్ దిగుతూ ఉన్న గ్లింప్స్ ను విడుదల చేశారు. మొత్తానికి శ్రీవిష్ణుతో ఈ సినిమాకు మరింత వినోదాన్ని జోడించబోతున్నారు.

అయితే, శ్రీవిష్ణు పాత్రకు సంబంధించిన వివరాలను ఇంకా గోప్యంగానే ఉంచారు. కాగా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఢోకా ఉండదని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి..!!

Vijay Deverakonda's Kingdom 2 Shelved! Naga Vamsi Confirms

Vijay Deverakonda’s Kingdom 2 Shelved! Naga Vamsi Confirms

WHO KNOWS, HOW AND WHEN LUCK HUGS!!