ఇది 60 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, ” శభాష్ రాముడు” షూటింగ్ లో యెన్.టి.ఆర్. మరియు, కాంత రావు గారు షూటింగ్ స్పాట్ లో ఉన్నారు, ఇంతలో ఒక టెలిగ్రామ్ వచ్చింది, కాంత రావు గారి నాయనమ్మ గారికి సీరియస్ గ ఉందని. కాంత రావు గారు అప్పుడప్పుడే ఎదుగుతున్న దశ. కాంత రావు గారి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు, తనకు రావలసిన రెమ్యూనరేషన్ లో కొంత ముందుగానే తీసుకొని ఉన్నారు, అయినా గత్యంతరం లేని పరిస్థితుల్లో నిర్మాత దగ్గరకు వెళ్లి విషయం చెప్పి, డబ్బులు అడిగారు, కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి కుదరదని చెప్పేసారు, ఏమి చేయాలో తెలియక కాంత రావు గారు మధన పడుతూ ఉన్నారు. ఊరెళితే కనీసం ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా ఎలా వెళ్ళాలి అని బాధపడుతూ కూర్చున్నారు.
ఇదంతా గ్రీన్ రూమ్ నుంచి ఒక వ్యక్తి గమనిస్తున్నారు ఆయనే యెన్.టి.ఆర్. అయన తన అసిస్టెంట్ ను పిలిచి కాంత రావు గారిని తన వద్దకు పిలిచి, తన వెంట కారులో ఇంటికి తీసుకొని వెళ్లి, ఆయనను హాలులో కూర్చోమని లోపలకు వెళ్లారు. అయోమయం గ చూస్తూ కాంత రావు గారు అక్కడే కూర్చున్నారు, అంతలో హాల్ లోకి వచ్చిన యెన్,టి,ఆర్. కాంత రావు గారి చేతిలో 5000 రూపాయలు ఉంచి, ఆ రోజుల్లో అది చాల పెద్ద మొత్తం, మీరు ప్రశాంతం గ వెళ్లి మీ కారక్రమం ముగించుకొని రండి, నేను నిర్మాతలకు చెబుతాను, కానీ తిరిగి వచ్చాక రెండు, మూడు నెలల్లో నా డబ్బులు తిరిగి ఇవ్వండి అని చెప్పారు. తన కళ్ళ ముందు శ్రీ కృష్ణుడే ప్రత్యక్షం అయి ఆ సహాయం చేసినట్లు గ భావించారు కాంత రావు గారు. ఎదుటి వారి అవసరాలకు ఆదుకున్న, అపాత్ర దానం మాత్రం చేసే వారు కాదు యెన్.టి.ఆర్. డబ్బు విలువ తెలిసిన మనిషి, అదే విధం గ కష్టం విలువ కూడా గుర్తు ఎరిగిన మనిషి యెన్.టి.ఆర్.