ఇటీవలే ‘మాస్టర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తమిళ స్టార్ హీరో విజయ్ తన తర్వాతి చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయకిగా పూజా హెగ్డేను ఫైనల్ చేశారు మేకర్స్. ఎనిమిదేళ్లకు ముందు పూజా హెగ్డే సినీ కెరీర్ మొదలైందే పరిశ్రమ నుండి. 2012లో వచ్చిన ‘మూగమూడి’ సినిమాతో ఆమె హీరోయిన్ అయింది. ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తెలుగు, హిందీ పరిశ్రమల మీద దృష్టి పెట్టింది. మళ్ళీ 9 ఏళ్ల తర్వాత ఆమె తమిళంలోకి రీఎంట్రీ ఇస్తోంది. ఆ రీఎంట్రీ కూడ విజయ్ లాంటి స్టార్ హీరోతో కావడం విశేషం. ఈ సినిమా గనుక మంచి విజయాన్ని సాధిస్తే తమిళంలో కూడ పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది. అసలే తమిళంలో గ్లామర్ హీరోయిన్ల కొరత ఉంది. ఆ ఖాళీని పూరించే గోల్డెన్ ఛాన్స్ ఆమెకే దొరుకుతుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు అనిరుద్ సంగీతం అందివ్వనుండగా మనోజ్ పరమహంస డీవోపీ చేస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది.