ప్రస్తుతం కెరీర్ లో వరుస సినిమాల చేస్తూ బిజీగా దూసుకెళ్తోంది యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్. ఓ వైపు ప్రభాస్, మరోవైపు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. పవర్ స్టార్ సరసన హరిహర వీరమల్లు, ప్రభాస్ తో రాజాసాబ్ సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో తన ఇమేజ్ ను మరింత పెంచుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది.
అయితే ఇటీవలే ‘రాజాసాబ్’ సినిమా నుంచి నిధి అగర్వాల్ లుక్ లీక్ అంటూ ఓ ఫొటో నెట్టింట తెగ వైరలైంది. దీంతో వెంటనే నిధి అగర్వాల్ ఎలర్ట్ అయింది. ఆ ఫొటోపై వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ స్టిల్కు ‘రాజాసాబ్’ సినిమాకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఓ యాడ్ షూట్ లో భాగంగా తీసిన ఫొటోల నుంచి ఆ స్టిల్ లీక్ అయినట్లు క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి..!!