చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన మొదటి పాన్ ఇండియా సినిమా #Sharwa38 తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా, శర్వా మరియు సంపత్ నందికి ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్న ఈ ప్రాజెక్ట్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో హైబడ్జెట్‌లో తెరకెక్కుతోంది..
ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా అనౌన్స్ చేసిన తర్వాత, ఇప్పుడు క్రూషియాల్ పాత్ర కోసం డింపుల్ హయాతిని ఎంపిక చేశారు మేకర్స్. ఇది ప్రాజెక్ట్ కు మరింత స్టార్ పవర్ ని యాడ్ చేసింది. డింపుల్ హయాతి పాత్రలో ఒక ఇంటెన్స్ ఎనర్జీ కనిపించనుంది. ఆమె పాత్రకు బంగారు ఆభరణాలతో ప్రత్యేకమైన లుక్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అనుపమ కూడా ఈ సినిమాలో బోల్డ్ లుక్‌తో కనిపించనుండగా, ఇద్దరు హీరోయిన్లూ తమ పాత్రల ద్వారా కథకు బలాన్ని అందించనున్నారు..!!