in

Dulquer Salmaan’s key role in prabhas, hanu raghavapudi movie?

సౌత్ హీరోలు మిగతా భాషల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సాల్మన్ సొంత భాషా సినిమాలతో పాటు, హిందీ,  తెలుగు,  తమిళం, మలయాళం, సినిమాల్లో నటిస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోగా ఎదిగారు. ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన దుల్కర్ తెలుగులో నేరుగా సీతా రామం సినిమాతో అలరించారు. అంతకుముందు మళయాలం లో నటించిన మూవీస్ డబ్బింగ్ తో తెలుగువారికి దగ్గరయ్యాడు..

ఇపుడు తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకుంటూ బిజీ బిజీ గా ఉన్నాడు దుల్కర్. తేజ సజ్జా మిరాయ్ లో దుల్కర్ గెస్ట్ రోల్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ సినిమాలో కూడా నటించే ఛాన్స్ అందుకున్నట్లు  తెలుస్తోంది.  ప్రభాస్, హను  రాఘవపూడి ల కాంబోలో ఒక చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఒక కీలకమైన పాత్ర కోసం దుల్కర్ ని సంప్రదించినట్లు సమాచారం. హను రాఘవపూడి, దుల్కర్ కాంబోలో వచ్చిన సీతా రామం భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే..!!

allu arjun to romance pooja hegde and kriti sanon?

happy birthday vijay devarakonda!