in

Dulquer salmaan to romance young Krithi Shetty?

కృతి శెట్టి విషయానికి వస్తే ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. నాని సరసన నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. అయితే రామ్ పోతినేని వారియర్ అనే సినిమాలో నటించింది కృతి ఈ సినిమా కూడా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. మొదటి సినిమా హిట్ అయినా కూడా తర్వాత వచ్చిన సినిమాలు ఏమీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక రీసెంట్ గా మనమే అనే సినిమాతో మరోసారి ప్రాక్షకులను పలకరించింది కృతి శెట్టి.

ఇకపోతే ప్రస్తుతం కృతి శెట్టికి ఒక పాన్ ఇండియా సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక ఆ సినిమా తర్వాత తెలుగులో వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. ఇక ప్రస్తుతం దుల్కర్ లక్కీ భాస్కర్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కాంత అని ఒక పాన్ ఇండియా సినిమాను చేయనున్నాడు దుల్కర్. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి..!!

happy birthday mm keeravani!

Sudheer Babu’s pan india Supernatural Mystery Thriller!