దుల్కర్ సల్మాన్‌కి సౌత్‌లో మంచి ఇమేజ్ ఉంది. ముఖ్యంగా మళయాళంలో ఈ హీరోకి భారీ ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా బాలీవుడ్ కూడా వెళ్లాడు. మళయాళీ హార్ట్ త్రోబ్‌గా అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి దుల్కర్ ఇప్పుడు అపాలజీస్టార్‌గా మారుతున్నాడు. దుల్కర్ సల్మాన్ ‘వేఫరర్ ఫిల్మ్స్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థ స్టార్ట్ చేశాడు. ఈ బ్యానర్‌లో సురేశ్ గోపీ, శోభన లీడ్ రోల్స్ల్‌లో ‘వరానె అవశ్యముండు’ అనే సినిమా తీశాడు.
అయితే ఈమూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చినప్పటి నుంచి రోజుకో కాంట్రవర్సీ క్రియేట్ అవుతోంది. మొన్న ఓ ముంబై జర్నలిస్ట్ తనని బాడీ షేమింగ్ చేశారని కామెంట్ చేస్తే, ఆమెకి క్షమాపణలు చెప్పాడు. నిన్న తమిళుల నుంచి విమర్శలు వచ్చాయి. ‘వరానె అవశ్యముండు’ సినిమాలో దివంగత ఎల్టీటీఈ ప్రభాకరన్‌ని అవమానించారని, నిర్మాత దుల్కర్ సల్మాన్, దర్శకుడు అనూప్‌పై విమర్శలు చేస్తున్నాడు కొంతమంది నెటిజన్లు. దీంతో ఇది కావాలని చెయ్యలేదని, ప్రభాకరన్ ట్రాక్‌కి పాత మళయాళీ సినిమా ‘పట్టన ప్రవేశమ్’ రిఫరెన్స్ అని ట్వీట్ చేశాడు. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించడని పెద్ద లెటర్ ట్వీట్ చేశాడు దుల్కర్.