దర్శక దిగ్గజాలు డబ్బింగ్ ఆర్టిస్టులు గ అవతరించిన వేళ! 1981 లో విశ్వనాధ్ గారి దర్శకత్వం లో వచ్చిన “సప్తపది” చిత్రం లో హీరో గ నటించిన గిరీష్ ప్రధాన్ స్వతహాగా కన్నడిగుడు, ఆయనకు తెలుగు రాదు, అది కాకా ఆ పాత్రకు చాల భావ గంభీరమయిన డైలాగ్స్ ఉన్నాయి. కొత్త నటుడు కావటం తెలుగు మాతృ భాష కాక పోవటం తో ఆ పాత్ర యెక్క ఔచిత్యానికి తగినట్లుగా డైలాగ్స్ చెప్పే బాధ్యతను విశ్వనాధ్ గారే నిర్వహించారు. అప్పటి వరకు విశ్వనాధ్ గారు ఎప్పుడు తెర మీద కనిపించ లేదు, ఆయన పెద్దగా ఇంటర్వ్యూలు అవి ఇచ్చేవారు కాదు, వేదికలెక్కి ఉపన్యాసాలు చెప్పే వారు కాకా పోవటం తో విశ్వనాథ్ గారి గాత్రం ప్రేక్షకులకు అసలు పరిచయం లేదు.
సప్తపది చిత్రం లో గిరీష్ కు విశ్వనాథ్ గారు చెప్పిన డైలాగులోని మాడ్యులేషన్, గాత్రం లోని గాంభీర్యం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. గిరీష్ నటనకు విశ్వనాధ్ గారి గాత్రం అదనపు ఆకర్షణగా ఎంతో బలాన్ని చేకూర్చింది అనటం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. కళాతపస్వి తనకు డబ్బింగ్ చెప్పటం ఎంతో అదృష్టం గ, ఒక ఆశీర్వాదంగా భావించారు గిరీష్ ప్రధాన్..దర్శక రత్న దాసరి నారాయణ రావు నటుడిగా కూడా మనందరికీ సుపరిచితులు, ఆయన స్టైల్ అఫ్ డైలోగ్స్, ఆయన వాయిస్ తెలుగు ప్రేక్షకులు అందరికి సుపరిచితమే.
1981 లో దాసరి దర్శకత్వం లో అందరు కొత్త నటి, నటులతో నిర్మితమయిన చిత్రం “స్వప్న”. ఈ చిత్రం లో ఇద్దరు హీరోలు, రాజా తెలుగు వాడు, రెండవ హీరో అయిన రాంజీ తమిళుడు కావటం తో డబ్బింగ్ చెప్పే బాధ్యత దాసరి గారు తీసుకున్నారు. తన గాత్ర ధర్మానికి భిన్నం గ రాంజీ కి తగినట్లుగా ఒక మిమిక్రి ఆర్టిస్ట్ రేంజ్ లో తన వాయిస్ ని మార్చి డైలోగ్స్ చెప్పారు దాసరి. సినిమా రిలీజ్ తరువాత రాంజీ కి డబ్బింగ్ చెప్పింది దాసరి గారే అని చెప్పిన, ప్రేక్షకులు నమ్మ లేనంత గొప్పగా చెప్పారు. దర్శక దిగ్గజాలు ఇద్దరు డబ్బింగ్ ఆర్టిస్టులు గ కూడా వంద మార్కులు కొట్టేశారన్నమాట..