in

‘Drishyam’ girl Esther Anil gives green signal for glamour roles!

దృశ్యం’ మూవీ సీరిస్‌లో బాలనటిగా కనిపించిన ఎస్తేర్ అనిల్.. ఇప్పుడు హాట్ అవతారం ఎత్తింది. అదేంటీ.. ఇంత చిన్న పిల్ల ఇలా అందాలు ఆరబోస్తుందని అంతా ముక్కున వేలు వేసుకుంటున్నారు. అవకాశాల కోసం అప్పుడే.. డేరింగ్ స్టెప్స్ వేస్తోందని అంటున్నారు. అయితే, ఆమె వయస్సు తెలిసిన తర్వాత.. మళ్లీ మీరు ఆ మాట అనరు. ఎందుకంటే.. ఈమె ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి కంటే పెద్దది. నమ్మబుద్ధి కావడం లేదా? కేరళకు చెందిన మలయాళ కుట్టి.. వయనాడ్‌లో 2001లో జన్మించింది.

2010లో అంటే దాదాపు తొమ్మిదేళ్ల వయస్సులో ‘నల్లవన్’ అనే మలయాళ చిత్రంతో బాలనటిగా వెండితెరపైకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో ఆమె బాలనటిగా నటించి ఆకట్టుకుంది. ఫలితంగా ఆమెకు 2013లో మలయాళ చిత్రం ‘దృశ్యం’లో అవకాశం వచ్చింది. అప్పటికి ఆమె వయస్సు 12 ఏళ్లు. ఆ తర్వాత 2014లో తెలుగులో రిమేక్ చేసిన ‘దృశ్యం’లో కూడా ఆమే నటించింది. అప్పటికి ఆమెకు 13 ఏళ్లు. చూసేందుకు చిన్న పిల్లగా కనిపించడంతో ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయింది…

ఓటీటీలో విడుదలైన తెలుగు ‘దృశ్యం 2’కు మంచి రేటింగ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్తేర్ కూడా తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది. ప్రస్తుతం ఎస్తేర్‌కు 20 ఏళ్లు. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కృతి శెట్టికి 18 ఏళ్లు. ఈ లెక్కన చూసుకుంటే..ఎస్తేర్ హీరోయిన్‌గా తన లక్‌ను పరీక్షించుకోడానికి అన్నివిధాలా అర్హురాలే. అయితే.. ముందుగా ఆమె ‘బాలనటి’ మార్క్ నుంచి బయటపడాలి. అందుకే.. అందాల ఆరబోతతో ఎలాంటి పాత్రలకైనా సిద్ధమేనని గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

top 10 flop movies of tollywood in 2021!

ts congress leader addanki dayakar turns as a cinema hero!