in

dragon beauty Kayadu Lohar joins Nani’s paradise!

డ్రాగన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి కాయదు లోహర్, ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’లో ఆమె నటిస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. థియేటర్లో ఈ సినిమా గ్లింప్స్‌కు వచ్చిన రెస్పాన్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తను ఈ భారీ ప్రాజెక్టులో భాగమైనట్లు క్లారిటీ ఇచ్చింది.

​ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 26, 2026న విడుదల కానుంది. కాయదు తన కెరీర్‌లోనే ఇంత పెద్ద ప్రాజెక్టులో నటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాలో ఆమె పాత్ర గురించి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం నాని సినిమా మాత్రమే కాకుండా, దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఐ యామ్ గేమ్’ (I’m Game) అనే చిత్రంలో కూడా కాయదు ముఖ్య పాత్ర పోషిస్తోంది..!!

Sivaji apologizes for derogatory comments on women!