ఇండస్ట్రీలో ఓ హీరోతో అనుకున్న కథ మరో హీరోకి వరకు వెళ్లి చివరకి మరో హీరోతో పట్టాలేక్కుతుంది ఇది సహజమే కూడా… అలాంటి విషయమే డాన్‌శీను చిత్ర సమయంలో కూడా జరిగింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా మొత్తం ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. అవే డాన్ శీను, బలుపు, క్రాక్ చిత్రాలు. సక్సెస్ఫుల్ కాంబినేషన్‌గా ఇండస్ట్రీలో వీరికి మంచి పేరుంది. ముందుగా వీరి కాంబినేషన్ నుంచి వచ్చిన చిత్రం డాన్ శీను.. ఇదే గోపీచంద్ మలినేనికి దర్శకుడిగా మొదటి సినిమా. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా స్టోరీ లైన్‌ను గోపీచంద్ మలినేని ముందుగా ప్రభాస్‌కు వినిపించాడట.. లైన్ నచ్చడంతో ప్రభాస్ కూడా చేద్దామని అన్నాడట.
ఆ సమయంలో ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ క్రమంలో హీరో గోపీచంద్.. గోపీచంద్ మలినేనికి రిలేషన్ కావడంతో అదే లైన్ ని గోపీచంద్కూడా వినిపించాడట. గోపీచంద్‌కి లైన్ నచ్చడంతో సినిమా చేద్దామని చెప్పాడట. గోపీచంద్ ఒకే చెప్పడంతో దిల్‌రాజుతో ఈ కథను చేద్దామని అనుకున్నారట గోపీచంద్ మలినేని.. అయితే సినిమా స్టొరీ విన్న దిల్ రాజు ఈ సినిమా గోపీచంద్ కంటే రవితేజకి బాగా సూట్ అవుతుందని చెప్పారట. ఆ సమయంలో గోలీమార్ సినిమాతో గోపీచంద్ కూడా బిజీగా ఉండడంతో అతను కూడా ఈ సినిమాని చేయలేకపోయాడు. అలా ఈ కథ ప్రభాస్ నుంచి గోపీచంద్‌ని దాటుకొని రవితేజ వద్దకి వెళ్ళింది.