రాజస్థాన్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్ అర్చన ఆత్మహత్యకు పాల్పడటం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఆత్మహత్యపై భారతీయ వైద్య సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే, ప్రసవం సమయంలో ఓ మహిళ మరణించింది. దీంతో డాక్టర్ అర్చనపై ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..ఈ క్రమంలో ఆమెపై పోలీసు కేసు నమోదయింది. అయితే సదరు మహిళ మరణానికి తాను కారణమని నిందించడాన్ని అవమానకరంగా భావించిన అర్చన ఆత్మహత్య చేసుకున్నారు.
అంతేకాదు, అమాయక వైద్యులను వేధించవద్దని సూసైడ్ నోట్ కూడా రాశారు. ఈ నేపథ్యంలో అర్చనకు హీరోయిన్ ప్రణీత మద్దతుగా స్పందించింది. తాను నిర్దోషిఅని నిరూపించుకోవడానికి ఓ వైద్యురాలు తన జీవితాన్ని ముగించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రతి సందర్భంలో ఒక డాక్టర్ వేధింపులకు గురవుతున్నారని… దీంతో మరొకరి ప్రాణాన్ని కాపాడేందుకు మరో 100 మంది డాక్టర్లు రిస్క్ తీసుకోవడాన్ని మానేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో దురదృష్టకరంగా మీరు ఎంతో ప్రేమించే వ్యక్తి మూల్యం చెల్లించుకునే పరిస్థితి రావచ్చని… ఈ విషయం మీకు తెలియకుండానే జరిగిపోతుందని అన్నారు.