యువ హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా సినిమా రూపొందుతోంది. సైమా, ఆహా పురస్కార వేడుకల్లో బెస్ట్ డెబ్యూడెంట్ ప్రొడక్షన్ హౌస్ అవార్డులు అందుకున్న లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ‘కలర్ ఫొటో’, ‘తెల్లవారితే గురువారం’ తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకుడు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేయడంతో పాటు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు.
హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కార్తికేయ సతీమణి లోహిత కెమెరా స్విచ్ఛాన్ చేయగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు స్క్రిప్ట్ అందించారు. నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ “కార్తికేయకు ఇదొక డిఫరెంట్ సినిమా. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిస్తున్నాం. ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, యానాం పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా చిత్రీకరణ చేస్తాం.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. స్వర్గీయ సిరివెన్నెల గారు మా చిత్రంలో ఒక పాట రాశారు. ఆయన రాసిన ఆఖరి పాట ఇదే. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అన్నారు.. కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం.