లవ్ స్టోరీలను అద్భుతంగా తెరకెక్కించడంలో బొమ్మరిల్లు భాస్కర్ తనకు తానేసాటి. అఖిల్ అక్కినేని తో అప్పట్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా తీసి ప్రేక్షకులను అలరించారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్ధు కెరీర్ కు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించే ఈ సినిమా బాగా ఉపయోగపడుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుండగా.. ఇందులో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల ను హీరోయిన్ తీసుకోబోతున్నట్లు టాక్ నడుస్తోంది.
ఇక సిద్దు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. డీజే టిల్లుకు సీక్వెల్ గా రాబోతున్న ‘టిల్లు స్క్వేర్’ డబుల్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయింది. ఈ మూవీని సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘డీజే టిల్లు’ మూవీని విమల్ కృష్ణ డైరెక్ట్ చేస్తే, సీక్వెల్ ని మాత్రం మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా టిల్లు చేతిలో రెండు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది..!!