ఇటీవల తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్, గాయని సైంధవి తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, జీవీ విడాకులకు హీరోయిన్ దివ్య భారతి కారణమని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. గతంలో జీవీ ప్రకాశ్, దివ్య భారతి ఈ వివాదంపై స్పందించి వివరణ ఇచ్చినప్పటికీ, వీరిద్దరి మధ్య సంబంధం కొనసాగుతోందని రూమర్స్ వస్తూనే ఉన్నాయి..
తాజాగా దీనిపై దివ్య భారతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు..ఆమె ఈ పుకార్లపై తీవ్రంగా మండిపడ్డారు. తనకెలాంటి సంబంధం లేని వ్యక్తుల కుటుంబ విషయాల్లో తన పేరును లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీ ప్రకాశ్ కుటుంబ సమస్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను ఎవరితోనూ డేటింగ్‌లో లేనని, ముఖ్యంగా వివాహితులతో అసలు డేటింగ్ చేయనని కుండబద్దలు కొట్టారు. ఆధారాలు లేకుండా నిందలు వేయొద్దని పేర్కొన్నారు..!!