డైరెక్టర్ తేజ గారు, ఒక ఫిలిం డిస్ట్రిబ్యూటర్ ని సేవ్ చేయబోయి, దాని ఫలితంగా ఒక కోటి రూపాయలు పెనాలిటీ కట్టారు. 2005 వ సంవత్సరం లో తేజ డైరెక్షన్ లో నితిన్ హీరో గ సుధాకర్ రెడ్డి అనే నిర్మాత నిర్మించిన చిత్రం” ధైర్యం”. ఆ టైం లో తేజ గారిని ఒకతను వచ్చి కలిసాడు, సర్ మీరు తీసిన” జయం” సినిమా డిస్ట్రిబ్యూటర్ ని సర్, ఇప్పుడు “ధైర్యం” సినిమా కూడా కొందామని వచ్చాను అని చెప్పాడట, వెంటనే తేజ గారు అలాగా మీ భార్య, పిల్లలు జాగర్త !అని అన్నారట, ఆ డిస్ట్రిబ్యూటర్ ఆ సినిమా కొనకుండా వెళ్లిపోయారు. ధైర్యం సినిమా రిలీజ్ అయింది అనుకున్న స్థాయిలో నడవలేదు, ప్రొడ్యూసర్ నష్టపోయారు, అప్పుడు సినిమా కొనకుండా వెళ్లిపోయిన డిస్ట్రిబ్యూటర్, తేజ గారు అన్న మాటను వ్రాత పూర్వకంగ నిర్మాతకు తెలియచేసారు,
నిర్మాతల మండలి లో తేజ మీద అభియోగం మోప పడింది, డైరెక్టర్ సినిమా కోన వద్దని చెప్పాడని. డైరెక్టర్ అయి ఉండి డిస్ట్రిబ్యూటర్ ని సినిమా కోన వద్దని చెప్పటం తప్పు అని తేల్చారు, డైరెక్ట్ గ కోన వద్దని చెప్పక పోయిన, తాను మాట్లాడిన మాట వలన డిస్ట్రిబ్యూటర్ వెనకకు పోవటం జరిగింది కాబట్టి తేజ గారు కూడా నిర్మాతల మండలి తీర్పుకు తలవొగ్గి కోటి రూపాయల పెనాలిటీ కట్టటం జరిగింది. డిస్ట్రిబ్యూటరుకి మంచి చేయ బోయి, కోటి రూపాయలు నష్టపోయిన భోళా మనిషి తేజ గారు. మనసులో ఒకటి పైకి ఒకటి కాదు, తాను అనుకున్నది అనుకున్నట్లు బయటకు మాట్లాడే మనిషి తేజ గారు. కొంచెం కృతకంగా ఉండే సినీ పరిశ్రమలో తేజ వంటి వారు చాల అరుదుగా ఉంటారు.