
మొదటి సినిమా బింబిసారతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు వశిష్ట. ఈ క్రమంలోనే చిరంజీవి పిలిచి మరీ వశిష్టకు అవకాశం ఇచ్చాడు. ఇక వశిష్ట మూడవ సినిమా సంగతేంటి అంటే.. చిరు కాంపౌండ్ లోనే వశిష్టను మరో సినిమాకు కూడా లాక్ చేసినట్లు సమాచారం. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ తో తన మూడవ సినిమా చేయాల్సిందిగా చిరంజీవి వశిష్టను అడిగినట్లు సమాచారం. ఇక చిరంజీవి లాంటి టాలీవుడ్ పెద్దన్న అడిగితే ఎవరు మాత్రం కాదనగలరు. ఈ క్రమంలోనే వశిష్ట కూడా ఓకే చేసినట్లు సన్నిహిత వర్గాల నుంచి టాక్ నడుస్తుంది. వైష్ణవ్ తేజ్ కూడా..కొంతకాలంగా వరుస ఫ్లాపులను ఎదుర్కొంటున్నాడు..!!
					
					
