బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించాడు వశిష్ఠ. తక్కువ బడ్జెట్ తో అద్భుతమైన చిత్రం అందించాడని అందరూ మెచ్చుకున్నారు. కానీ బింబిసారకు ముందు వశిష్ఠ చాలా ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాడు. కానీ తన డెబ్యూ మూవీ రాత మార్చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో ఒక్కసారిగా పారితోషికం మూడు కోట్లకు పెరిగిపోయింది. బింబిసారకు వశిష్ఠకు పెద్దగా పారితోషికం ఇవ్వలేదు కళ్యాణ్ రామ్. నెల జీతానికి పనిచేసాడు. కానీ చిత్రం హిట్ అయితే సీక్వెల్ కు భారీ రెమ్యునరేషన్ ఇస్తానని మాట ఇచ్చాడు. అన్నట్లుగానే బింబిసార 2 కు వశిష్ఠకు మూడు కోట్లు పారితోషికాన్ని కళ్యాణ్ రామ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే గీతా ఆర్ట్స్ కూడా ముందుగా అడ్వాన్స్ ఇచ్చి ఈ దర్శకుడ్ని లాక్ చేసుకున్నారు. వారు కూడా మూడు కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ యువ దర్శకుడికి భారీగా డిమాండ్ ఉన్నా కానీ ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేయడం మీదే దృష్టి పెడుతున్నాడు..!!