రామ్ చరణ్ హీరోగా,శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గేమ్ చేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమా. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు మూవీ యూనిట్. ఇందులో భాగంగానే చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ ని యూఎస్ఏ లోని డల్లాస్ లో నిర్వహించారు. ఈ వేడుకకి గేమ్ చేంజర్ మూవీ యూనిట్ తో పాటు పుష్ప డైరెక్టర్ సుకుమార్, ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు కూడా అతిథులుగా హాజరయ్యారు.
ఇక ఈ ఈవెంట్లో డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ టాలీవుడ్ సినిమా హీరోలతో తాను ఇదివరకే సినిమాలు చేయాలనుకున్నానని కానీ కుదరలేదని చెప్పారు. చిరంజీవితో సినిమా చేయాలనుకున్నాను, అలాగే మహేష్ బాబు తో కూడా సినిమా తీయాలనుకున్నాను. ఆఖరికి కరోనా టైంలో ప్రభాస్ తో సినిమా తీయటానికి డిస్కషన్స్ కూడా జరిగాయి కానీ అవేవీ సెట్ కాలేదు. ఆఖరికి రామ్ చరణ్ తో మూవీ సెట్ అయింది..!!