ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. చివరగా ఆయన మనసులోని మాట ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘హలో అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను సోషల్ మీడియాకు దూరంగా వెళ్లాలని భావిస్తున్నాను, ఈ సోషల్ మీడియా ద్వారా నేను అనేక విషయాలను మీ దృష్టికి తీసుకు వచ్చాను కానీ ఇప్పుడు సోషల్ మీడియా నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చేసింది”
అంటూ ఆయన ప్రకటించారు…మీడియా మిత్రుల ద్వారా మీతో టచ్‌లోనే ఉంటాను. ఎప్పుడూ మీతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటా. మీడియం మారుతుందేమోకానీ మన మధ్య ఉన్న బంధం మారదు అంటూ అని కొరటాల ట్వీట్ చేశారు. ప్రస్తుతం కొరటాల.. చిరంజీవి హీరోగా ఆచార్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా.. రామ్‌చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు.