డైరెక్టర్స్ నటులు అవటం, రైటర్స్ నటులు అవటం, నటులు డైరెక్టర్లు అవటం మన చిత్ర పరిశ్రమలో చాల సహజం. కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చి, డైరెక్టర్ గ మారి హిట్ కొట్టిన వ్యక్తి ఒకరు ఉన్నారు తెలుసా? అయన మరెవరో కాదు ” బింబిసార” చిత్ర దర్శకుడు అయిన వశిష్ట. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ కుమారుడు అయిన వెంకట్ 2007 లో “ప్రేమలేఖ రాసా” అనే సినిమా తో హీరో గ పరిచయం అయ్యారు, అంజలి హీరోయిన్ గ నటించిన ఈ చిత్రానికి రచయిత కులశేఖర్ డైరెక్టర్ గ మెగా ఫోన్ పట్టారు. వెంకట్ ను అందరు ముద్దుగా వేణు అని పిలిచే వారు (కారణం మనకు తెలియదు), కొన్నిఅనుకోని కారణాలతో ఆ సినిమా రిలీజ్ కి నోచుకోలేదు, కానీ ఈ చిత్రం యు ట్యూబ్ లో అయితే ఉన్నది. మొదటి సినిమాతో ఎదురయిన చేదు అనుభవం తో వెంకట్ నటనకు గుడ్ బై చెప్పి డైరెక్షన్ మీద ఫోకస్ పెట్టారు.
ఒక ఫాంటసీ కథ తయారు చేసుకున్న వేణు చాల మంది ని కలవటం జరిగింది, కొత్త దర్శకుడి మీద నమ్మకం లేక కొందరు, ఫాంటసీ సినిమా కాబట్టి గ్రాఫిక్స్ ఖర్చుకు భయపడి కొంతమంది వెనకడుగు వేశారు. చివరకు ఆ కథ కళ్యాణ్ రామ్ వినటం, ఆయనకు నచ్చటం తో ఆయన సొంత బ్యానేర్ లో చిత్ర నిర్మాణం చేసారు, ఈ సినిమా కోసం తన పేరును వశిష్ట గ మార్చుకున్నారు వెంకట్ ఉరఫ్ వేణు. కధా బలం కలసి వచ్చిందో, పేరు బలం కలసి వచ్చిందో మొత్తానికి “బింబిసార” హిట్ అయ్యింది, వరుస ప్లాప్ లతో అల్లాడిపోతున్న తెలుగు చిత్ర పరిశ్రమకు ఊరటను ఇచ్చింది. డైరెక్టర్ గ మారి హిట్ కొట్టిన ఈ మాజీ హీరో నిజ జీవితంలో హీరో అయ్యాడు. ఇతనిలో స్పార్క్ ను గుర్తించిన కళ్యాణ్ రామ్ కు హాట్స్ ఆఫ్ చెప్పాలి, ఒక మంచి చిత్రాన్ని అందించినందుకు థాంక్స్ చెప్పాలి..