
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]టా[/qodef_dropcaps] లీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. దిల్ రాజు భార్య అనిత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత తన ఒక్కగానొక్క కుమార్తెకు పెళ్లి చేసి పంపించారు. కూతురు అత్తగారింటికి వెళ్లిపోవడంతో దిల్ రాజు ఒంటరిగా ఉంటున్నారట. అందుకే మళ్లీ పెళ్లి చేసుకుని తన జీవితానికి ఓ తోడు కావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సినీ నేపథ్యంలేని బ్రాహ్మణ యువతితో దిల్ రాజు పెళ్లి జరగనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ రూమర్స్‌లో ఎంత నిజం ఉందో తెలియాలంటే దిల్‌రాజే స్పందించాలి.