డిప్రెషన్‌తో చనిపోదామనుకున్నా’ అని బాలీవుడ్ నటి దీపికా పదుకొణె పేర్కొన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌ల్లో ఒకరైన దీపికా ఇలా అనుకోవడమేంటి..అనుకుంటున్నారా.. గతంలో తాను డిప్రెషన్ బారిన పడిన సమయంలో ఈ విధంగా అనుకున్నానని అన్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటి దీని వెనుక కారణమేంటో కూడా వివరించారు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమానికి కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్‌తో కలిసి హాజరయ్యారు. వీరిద్దరూ తమ వ్యక్తిగత జీవితాల గురించి పలు ఆసక్తికర అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా.. దీపికా.. తను గతంలో డిప్రెషన్‌లోకి వెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. . 2014లో నేను డిప్రెషన్‌లో ఉన్నాను. లేవగానే విచిత్రంగా ఉండేది. ఉన్నట్టుండి ఏడ్చేసేదాన్ని.