ఆమె దీపికా పదుకొనే పోషించిన పాత్ర సుమతిని బౌంటీ హంటర్స్ నుంచి రక్షించడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఆమె కోసమే తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. ఈ మూవీ ద్వారా అన్నా బెన్ కు కూడా మంచి పాపులారిటీ దక్కింది. అందులో తను పోషించిన పాత్ర ఫైర్ క్రాకర్ అంటూ తనను తాను మెచ్చుకోవడమే కాకుండా ఆమె సన్నివేశాలను మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ సినిమాతో కంపేర్ చేసుకుంది.
అలాగే అదే రివ్యూలో ప్రభాస్ పనితీరును విమర్శించి, ఆయన పరువు తీసేసిందని, ఈ సినిమాలో దిశా పటానితో ఆయన కలిసి పాడిన పాటను కూడా చులకన చేసిందని డార్లింగ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అన్నా ఆ పోస్టులో మొదటి సగంలో కొన్ని క్షణాలు తీసేస్తే సినిమా నిజమైన క్లాసిక్ గా ఉంటుందని నేను భావించాను. ప్రభాస్ తమాషాగా ప్రయత్నించే అనవసరమైన కామెడీ చాలా భయంకరంగా అనిపించింది. అలాగే సినిమా ఫీల్ కి సరిపోని సాంగ్స్ సీక్వెన్స్ కూడా” అంటూ ఏకంగా ప్రభాస్ ని టార్గెట్ చేసి ఫీడ్ బ్యాక్ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..!!