in

Dhanya Balakrishna: Rejecting intimate roles declined my career

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘రాజుగారి గది’, ‘నేను శైలజా’, ‘జయ జనకీ నాయక’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి ధన్య బాలకృష్ణ. ఆమె ప్రస్తుతం తన కొత్త సినిమా ‘కృష్ణ లీల’ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో పెద్ద విజయాలు సాధించలేకపోవడానికి కారణం నేనే. గ్లామర్ లేదా బోల్డ్ సీన్లను అంగీకరించకపోవడం వల్ల కొన్ని మంచి అవకాశాలు కోల్పోయాను.

మొదట్లో ఇతరులను చూసి నిరాశ చెందేదాన్ని, కానీ తర్వాత నేను తీసుకున్న నిర్ణయాలు నా మార్గాన్ని నిర్ణయించాయని అర్థమైంది” అని చెప్పింది. తన ఫ్యామిలీ నేపథ్యం కూడా ఇందుకు కారణం అంటూ ఆమె బాధపడుతూ చెప్పిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏదేమైనా గ్లామర్ పాత్రలకే ప్రిఫరెన్స్ ఇచ్చే మేకర్స్ ఉన్నంతవరకు తనలాంటి టాలెంటెడ్ హీరోయిన్లకు ఛాన్సులు రావడం కష్టమే అంటూ ఆమె చెప్పుకొచ్చింది..!!

Priyamani: happy that no more boundaries between film industries