in

Dhanush to romance ntr’s heroine Rukmini Vasanth!

తెలుగులో ఆయన లాస్ట్‌గా ‘కుబేర’లో నటించారు. ప్రస్తుతం తమిళంలో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా మారారు. ఇప్పటికే విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ‘కర’ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్ కాగా ఈ నెల 30 సినిమా థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత ‘అమరన్’ ఫేం రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ‘D55’ వర్కింగ్ టైటిల్‌తో ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తుండగా..

ఈ ప్రాజెక్ట్ తర్వాత ధనుష్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..కొత్త ప్రాజెక్టుకు ‘లబ్బర్ పండు’ ఫేం డైరెక్టర్ తమిళరసన్ దర్శకత్వం వహించనున్నారు. ‘D56’ వర్కింగ్ టైటిల్‌తో పీరియాడికల్ ఫాంటసీ, పొలిటికల్ యాక్షన్ ఎపిక్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో డ్రాగన్ బ్యూటీ ‘రుక్మిణీ వసంత్’ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇద్దరి కాంబోలో రాబోతోన్న ఫస్ట్ మూవీ ఇదే అవుతుంది. గతేడాది కాంతార ప్రీక్వెల్‌తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు రుక్మిణి వసంత్. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’ మూవీ చేస్తున్నారు..!!

actress Anushka Shetty Getting Married Soon?