
మృణాల్ బర్త్డే కూడా ధనుష్ హాజరవడం..వీళ్ళిద్దరి మధ్యన ఏదో స్పెషల్ బాండ్ ఉందంటూ..అందుకే ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించకపోయిన వీళ్ళిద్దరూ తరచూ కలుసుకుంటున్నారని.. క్లోజ్ గా ఉంటున్నారు అంటూ వార్తలు తెగ వినిపిస్తున్నాయి. అయితే.. ఈ రూమర్లకు అనుగుణంగానే మృణాల్, ధనుష్ కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో ధనుష్ పెట్టిన ఎన్నో పోస్టులకు మృణాల్ రియాక్ట్ అవుతూ వచ్చింది. దీంతో.. వీళ్ళిద్దరి మధ్యన ఏదో నడుస్తుంది అన్న వార్తలకు మరింత బలం పెరిగింది.
ఇలాంటి క్రమంలో మృణాల్ నటించిన లేటెస్ట్ మూవీ ధో దీవానే షహర్ మే సినిమా టీజర్ రిలీజ్ కాగా..ఆ టీజర్‌ను మృణాల్ తన ట్విటర్ వేదికగా పంచుకుంది. ఇక ఈ పోస్ట్‌పై ధనుష్ రియాక్ట్ అవుఎతూ చాలా బాగుందని కామెంట్స్ చేశాడు. మృణాల్ దానికి లవ్ సింబల్స్‌తో రిప్లై ఇచ్చింది. ఈ కామెంట్ల దెబ్బకు.. డౌట్ లేదు వీళ్ళిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారు, కచ్చితంగా డేటింగ్ చేస్తున్నారు, అందరూ అనుకున్నదే జరగబోతుంది, త్వరలోనే ధనుష్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేశారు..!!
