in

devara to peddi, jhanvi kapoor hikes her pay!

దివంగత అతిలోకసుందరి శ్రీదేవి నటవరసరాలిగా జాన్వి క‌పూర్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాలీవుడ్‌లోను తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ..మొదట టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌సన తన అందచందాలతో ఆకట్టుకున్న జాన్వి.. పలువురు సౌత్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తుంది..

దీనికోసం కోట్లల్లో రెమ్యూనరేషన్ను ఛార్జ్ చేస్తుందని సమాచారం..దేవర కోసం రూ.5 కోట్ల రమ్యునరేషన్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు చరణ్ పెద్ది కోసం మరో కోటి రూపాయలు పెంచేసి ఏకంగా రూ.6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందట. పేరుకు తగ్గట్టే పెద్ది భారీ బడ్జెట్‌లో తెర‌కెక్కుతున్న క్రమంలో..చరణ్‌కి జోడిగా జాన్వి హీరోయిన్గా మెరుస్తోంది. ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెల‌కొన్నాయి. కొన్ని నివేదికల ప్రకారం సినిమాలో జాన్వికి ఆరు కోట్ల పారితోష‌కం ఇస్తున్నారని టాక్‌ తెగ వైరల్ గా మారుతుంది..!!

things keerthy suresh does when she is upset!

Raashii Khanna joins Ustaad Bhagat Singh as shloka!