అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపించాయి. ఇందులో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనుంది. అలాగే మరొక పాత్ర కోసం టాలీవుడ్ హీరోయిన్ మృనాల్ ఠాకూర్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మరొక హీరోయిన్గా రష్మిక మందనను సెలెక్ట్ చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి..
అయితే ఇదివరకు రష్మిక పేరుకు బదులుగా జాన్వి కపూర్ పేరు వినిపించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు అనుహ్యంగా రష్మిక పేరు గట్టిగా వినిపిస్తోంది. చిత్రబృందం రష్మిక మందన్నతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అన్నీ కుదిరితే ఈ జోడీ మరోసారి తెరపై సందడి చేయడం ఖాయం. కాగా అల్లు అర్జున్, అట్లీ కలయికలో సినిమాపై రోజుకి ఒక ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది..!!