నిన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన సంచలన ట్వీట్ తో మరోసారి దీపికా పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీపికా చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపికా అక్కడ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జీవితంలో బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే నిజాయితీ ముఖ్యం. దానికే ప్రాధాన్యత ఇస్తాను. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా తన మనసు చెప్పేది వింటాను..
ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను అని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. గత రెండు రోజులుగా ఈ అమ్మడు పేరు నెట్టింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీపికాకు సంబంధించిన పీఆర్ టీం స్పిరిట్ సినిమా స్టోరీని లీక్ చేసిందంటూ ప్రచారం నడిచింది. అందుకే డైరెక్టర్ సందీప్ రెడ్డి ధీటుగా కౌంటర్ ఇస్తూ నిన్న ట్వీట్ చేసినట్లుగా అభిప్రాయపడుతున్నారు నెటిజన్స్..!!