in

Deepika Padukone replaced with alia bhatt sparks backlash!

ప్రఖ్యాత అమెరికన్ దుస్తుల బ్రాండ్ ‘లీవైస్’కు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఇప్పటివరకు దీపికా పదుకొణె వ్యవహరించారు. అయితే, నిన్న ఆ సంస్థ అనూహ్యంగా దీపిక స్థానంలో అలియా భట్‌ను తమ కొత్త గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన క్షణం నుంచి దీపిక అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటిని ఎందుకు తొలగించారంటూ లీవైస్ బ్రాండ్‌ను, ఆ స్థానంలోకి వచ్చిన అలియా భట్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఈ మార్పుపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. “మాకు దీపికనే తిరిగి కావాలి, ఆమె స్థానంలో అలియా ఎందుకు?” అని ఒకరు కామెంట్ చేయగా, “లీవైస్ డెనిమ్‌లో దీపిక కనిపించినంత అందంగా మరెవరూ కనిపించరు” అని మరో యూజర్ అభిప్రాయపడ్డారు. మరికొందరు అభిమానులు ఇంకాస్త ఘాటుగా స్పందిస్తూ అలియాపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. “అలియాకు దీపికను చూస్తే అసూయ, అభద్రతాభావం ఎక్కువ. అందుకే దీపిక నుంచి ప్రతీ అవకాశాన్ని లాగేసుకుంటోంది. అన్ని బ్రాండ్లు తనకే కావాలనే ఆశ ఆమెలో కనిపిస్తోంది”.!!

31 years for MR.PELLAM!

Sridevi rejected 'Baahubali'

Sridevi rejected ‘Baahubali’!