in

Deepika Padukone Out of prabhas Kalki 2!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లాస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించగా ఈ సినిమా తోనే బాలీవుడ్ నటి దీపికా పదుకోణ్ టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. మరి తన రోల్ తో ఆ సినిమాలో కూడా ఆమె మెప్పించగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక సీక్వెల్ లో కూడా ఆమె కనిపించనుంది అని మేకర్స్ తెలిపారు. కానీ ఆమె ఉండకపోవచ్చు అనే రూమర్స్ కూడా గట్టిగా వచ్చాయి..

కానీ ఫైనల్ గా చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు స్వయంగా కల్కి పార్ట్ 2 లో దీపికా పదుకోణ్ ఇక మీద నుంచి ఎలాంటి భాగం కాదని కన్ఫర్మ్ చేశారు. కల్కి 2898 ఎడి లాంటి చిత్రానికి మరింత కమిట్మెంట్ కావాల్సి ఉంటుందని అందుకే తమ దారులు ఇపుడు వేరైనట్టుగా తెలిపారు. మరి ఇది మాత్రం ఒకింత షాకింగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. ఇక పార్ట్ 2 పనులు ఆల్రెడీ కంప్లీట్ కాగా ప్రభాస్ డేట్స్ ఒకటి వస్తే మేకర్స్ వెంటనే షూటింగ్ మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు..!!

reason Why Keerthy Suresh Not Rushing into Films now!