ముంబై భామలు ఎంతమంది ఉన్నా సీనియర్ హీరోయిన్లు ఎటువంటి పోటీ ఇచ్చినా.. దీపికా స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. ఒకవైపు హిందీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరొకవైపు హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతోంది. అందం, అభినయంతో ఇంగ్లీష్ ఆడియన్స్ ను సైతం ఫిదా చేస్తున్న ఈమె ఇప్పటికే పలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఫేమస్ అయ్యింది. అంతేకాదు ఈమె అందానికి ఇప్పుడు మరొక గౌరవం దక్కిందని చెప్పాలి.. అదేమిటంటే ప్రపంచంలోనే తొలి పదిమంది అందగత్తెల్లో ఒకరిగా దీపికా స్థానం సంపాదించుకుంది” గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీఫై” అనే పేరుతో ఒక జాబితా రిలీజ్ అయింది..
లండన్ కు చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ జలియన్ డిసిల్వా దీనిని రూపొందించారు. సైంటిఫిక్ ప్రమాణాల ప్రకారం ప్రతి ఏడాది ఇలాగే జరుగుతుంది. ఇక ఎప్పటిలాగే 2022 ఏడాదికి గాను తన జాబితాను రిలీజ్ చేయగా ఈ జాబితాలో దీపిక 91.22%తో 9వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో తొలి స్థానంలో జోడి కామర్ నిలిచారు. శారీరత పరిపూర్ణతతకు సంబంధించి అన్ని అంశాల్లో కూడా జోడి ముఖంలో ఉన్నాయని ఆమెకు మొదటి స్థానాన్ని కట్టబెట్టారు. వీరితోపాటు మరెంతో మంది ఈ జాబితాలో ఉండడం.. అందులోనూ ఒక ఇండియన్ ఉండడం చాలా గర్వకారణం అని చెప్పాలి..!!