
స్పిరిట్’ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకపోయినా, హీరోయిన్ ఎంపికపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. గతంలో మృణాల్ ఠాకూర్, ఆలియా భట్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ, నిర్మాతలు ఇంకా అధికారికంగా ఎవరినీ ప్రకటించలేదు. పాన్-ఇండియా స్థాయి సినిమా కావడంతో, దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరోయిన్‌ను ఎంచుకోవాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

