
సుమతి పాత్ర కథలో కీలక మలుపులు తిప్పే క్యారెక్టర్‌గా ఉంటుంది. సహజ నటనకు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే పాత్ర కావడంతో సాయిపల్లవే సరైన ఎంపిక అని చిత్ర యూనిట్ భావించిందట. ఇప్పటికే సాయిపల్లవిని సంప్రదించగా.. ఆమె సానుకూలంగా స్పందించారట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. సాయిపల్లవి ఎంపిక సరైనదేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె గత చిత్రాల్లో చూపిన న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఈ పాత్రకు కొత్త డైమెన్షన్ ఇవ్వనుందనే అంచనాలు ఉన్నాయి.
మరోవైపు దీపికా పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి వర్కింగ్ అవర్స్, షెడ్యూల్ సమస్యలు అని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అధికారికంగా నిర్మాతల నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రాకపోయినా.. సాయిపల్లవి రాకతో చిత్రానికి కొత్త ఎనర్జీ వచ్చిందనే భావన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ‘కల్కి 2898 AD’ ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు సుమతి పాత్రలో సాయిపల్లవి ఎంట్రీతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగిందని చెప్పాలి..!!

