in

Deepika Breaks Silence On Separation Rumours From Ranveer!

బాలీవుడ్ దంపతులు రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకొణె విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రణ్‌వీర్ నగ్న ఫొటోషూట్ వివాదం కారణంగా.. వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, చివరకు అవి విడాకుల వరకు వెళ్లాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఇప్పటి వరకు ఈ పుకార్లపై రణ్‌వీర్-దీపిక స్పందించలేదు. ఈ వార్తలపై క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తమ విడాకుల రూమర్లపై దీపికా పదుకొణె స్పందించింది. ఇటీవల ఓ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న దీపికాకు ఓ విలేకరు నుంచి విడాకులపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అలాంటిది ఏం లేదని, అవన్నీ వట్టి రూమర్లన్నీ కొట్టిపారేసింది. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. గత వారం రణ్‌వీర్ ఓ మ్యాజిక్ ఫెస్టివల్‌లో భాగంగా ఇంటికి దూరంగా ఉన్నారు. ఆయన తిరిగి రాగానే నన్ను చూసి పట్టలేనంత ఆనందాన్ని చూపించాడు. అంటూ విడాకులపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టింది.

Actress samantha tops again in Ormax Popularity Index!

Rakul Preet Singh REVEALS why she is not doing Telugu movies!