
ఒక తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. మలయాళం, తమిళ ఇండస్ట్రీలో కూడా సాయి పల్లవికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే సౌత్ లో తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్.. త్వరలో రామాయణం సినిమాతో నార్త్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టనుంది. రణబీర్ కపూర్ రాముడిగా కనిపించనున్న ఈ చిత్రంలో సాయి పల్లవి సీతగా కనిపించనుంది. భారీ బడ్జెట్లో రానన్న ఈ చిత్రంలో యాష్ రావణుడుగా కనిపించనుండగా..కాజల్ మందోదరిగా కనిపించనుంది..
అయితే ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి కాజాల అభిమానులు ఇంస్టాగ్రామ్ లో కొన్ని రీల్స్ షేర్ చేస్తున్నారు. అదేమిటి అంటే ఈ చిత్రంలో కాజల్ రావణాసురుడి భార్యగా కనిపించనుందగా..సాయి పల్లవి సీత పాత్రలో అంతే రావణాసురుడు తీసుకెళ్లే పాత్రలో కనిపించనుంది. ఈ క్రమంలో ఇంట్లో కాజల్ లాంటి భార్య ఉండగా..సాయి పల్లవి పైన యాష్ మనసు ఎందుకు పారేసుకుంటారు..? ఇది నమ్మశక్యంగా లేదు అంటూ ఎన్నో వీడియోలు క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు. ఇదంతా జోక్ గానే చేస్తూ ఉన్న..ఇలా సాయి పల్లవి కన్నా..కాజల్ అందంగా ఉంటుంది అని చెప్పి సాయి పల్లవి..పరువు తీస్తున్నారు ..!!