ప్రభాస్ అందరిని ” డార్లింగ్” అని పిలుస్తుంటారు, ప్రభాస్ గారు పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో నటించిన ” బుజ్జిగాడు” చిత్రం లో డార్లింగ్ అనే పిలుపుని ఉపయోగించటం జరిగింది. అసలు ఈ డార్లింగ్ అనే పిలుపు ఎక్కడ పుట్టింది? ఎటు ప్రయాణించింది ?చివరకు ప్రభాస్ నోట పలికి పాపులర్ అయింది ?.నటుడు, డైరెక్టర్, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన కాదంబరి కిరణ్ నోట వచ్చిన మాట అది. కెరీర్ ప్రారంభ దశ లో పూరి జగన్నాథ్, కాదంబరి కిరణ్ తో చాల సన్నిహితంగా ఉండే వారు, తనతో కలసి తిరిగిని పూరి డైరెక్టర్ గ ఎదుగుతున్న క్రమం లో పూరి ని కాదంబరి కిరణ్ గారు, డార్లింగ్ అని పిలిచే వారట,
ఆ పిలుపు నచ్చిన పూరి తనకు ఇష్టమయిన వారిని డార్లింగ్ అని పిలవటం మొదలెట్టారు. ఆ పిలుపుని బుజ్జిగాడు సినిమా లో వాడటమే కాక, ప్రభాస్ గారిని డార్లింగ్ అని పిలవటం మొదలెట్టారు పూరి జగన్నాథ్. బుజ్జి గాడు సినిమా లోనే కాకా బయట కూడా ఆ పిలుపుని కంటిన్యూ చేసారు ప్రభాస్ గారు, ఆ పిలుపు ఒక అలవాటుగా, తనకిష్టమయిన వారిని ఆలా పిలవటం పరిపాటిగా మారింది ప్రభాస్ గారికి . ఎక్కడో పుట్టి, ఎక్కడికో పెరిగి, ఎక్కడికి చేరిందో చూడండి డార్లింగ్ అనే పిలుపు. ఎక్కడ పుడితేనేమీ, ఆ పిలుపు ప్రభాస్ నోట పలికి అందరికి ఒక తీయనయిన అనుభూతిని పంచుతుంది.