
కాంట్రోవర్సియల్ డైరెక్టర్ అనె మాట వినగానే అందరికి టక్కున గుర్తొచ్చే ఒకే ఒక పేరు రామ్ గోపాల్ వర్మ. ఆయన గారు న సినిమా ని ఇల తీయాలని మైండ్ లొ ఫిక్స్ అయితే ఇంక చాలు బ్లైండ్ గ వెళ్ళిపోతారు. పొలిటిషన్స్ మీద, సెలెబ్రటీస్ మీద, రౌడీలా మీద, ఇల ఎవరిని వదలకుండా అందరి మీద బియోపిక్స్ తీశారు వర్మ గారు. నిజానికి ఇలాంటి బియోపిక్స్ ఓపెన్ గ అనౌన్స్ చేసి తీయడానికి చాలా దైర్యం కావలి. అది వర్మ దగ్గర టన్నుల కొద్దీ ఉందన్న విషయం వాస్తవం. ఒక సందర్భంలో వర్మ గారిని ‘అసలు మీ ధైరం ఏంటి’, ‘మొదటి నుండి ఇలాగె భయపడకుండా దైర్యం గ ఉండేవారు? అనె ప్రశ్నలకు వర్మ ఇల తన యంగ్ ఏజ్ లొ కాలేజీ స్టూడెంట్ గ ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్పుకొచ్చారు.
‘ఒక రోజు నేను ఇంక న ఆరుగురు ఫ్రెండ్స్ కలిసి అర్ధ రాత్రి మా పక్క వీధిలో ఉన్న ఒక వ్యక్తిని కొట్టడానికి వెళ్ళాం. అతను బాయ్స్ హాస్టల్ లొ ఉండేవాడు. తన రూమ్ దగ్గరికి వెళ్లి పేరు పిలిచి బైటకి రామాన్ని గట్టిగ అరిచాం. అతను డోర్ తీయగానే రూమ్ లొ నుండి ఒక్కసారిగా 20 మంది కత్తులు, బ్యాట్స్ పట్టుకొని వచ్చి మా మీదకి దాడిచేయడానికి వచ్చారు. మా గ్యాంగ్ లొ ఉన్న అందరూ బయపడి పారిపోయారు. కానీ నేను మాత్రం అసలు భయంలేకుండా వాళ్ళ గ్యాంగ్ లీడర్ ని కళ్ళలోకి కళ్ళు పెట్టి కోపంగా చూస్తూ ఉండిపోయాను. న ధైర్యాన్ని తెలుసుకున్న అతను నన్ను ఏమి గెలకుండా తన గ్యాంగ్ తొ న పక్కన నుండే సైలెంట్ గ వెళ్లిపోయారు. ఆరోజు నుండి నేను ఫిక్స్ అయ్యాను మనం భయపడకుండా గట్టిగ ఉంటె ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కోగలమని’ అని చెప్పారు వర్మ గారు. వేరే అతని మీద దాడి చేయాలన్న వర్మ గారి ఉదేశ్యం తప్పు అయినప్పటికీ ఆయన ఆరోజు చూపిన దైర్యం ని నిజంగా మనం మెచ్చుకోవాల్సిందే.. ఏమంటారు?

