in

dancing queen Sreeleela’s Shocking Pay For ‘Junior’!

జూనియర్’..యూత్ ను టచ్ చేస్తూ సాగే ఫ్యామిలీ డ్రామా. గాలి జనార్థనరెడ్డి తనయుడు కిరీటీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో, అతని జోడీగా శ్రీలీల ఆడిపాడనుంది. కీలకమైన పాత్రలో జెనీలియా కనిపించనుంది. ఈ సినిమా కోసం శ్రీలీల భారీ పారితోషికం తీసుకుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్రీలీల ఖాతాలో భారీ హిట్లు ఉన్నాయి. వాటి సంఖ్య తక్కువే అయినా అవి చూపించిన ప్రభావం ఎక్కువ. కొంతకాలంగా పెద్ద హిట్లు లేవు. అలాగని చెప్పి ఆమె క్రేజ్ ఏమీ తగ్గలేదు.

ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు..తమిళ.. హిందీ సినిమాలు ఉన్నాయి. అలాంటి ఆమె ఒక కొత్త  హీరో జోడీగా ఓకే చేయడమంటే రిస్క్ తో కూడిన వ్యవహారమే. కథా భారమంతా ఆమెనే మోయవలసి ఉంటుంది. అందువల్లనే భారీ మొత్తాన్నే పారితోషికంగా తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. ఆమె అత్యధిక పారితోషికం అందుకున్న సినిమా ఇదేనని అంటున్నారు. మరి ఈ సినిమా శ్రీలీలకి పారితోషికం మాత్రమే మిగిలేలా చేస్తుందా? సక్సెస్ ను కూడా తీసుకొస్తుందా? అనేది చూడాలి..!!

naga vamshi reveals key details about Jr NTR-Trivikram’s mythological film!