
ఒక్కప్పుడు ఐటెం సాంగ్స్ కోసం ప్రత్యేకంగా హాట్ మోడల్స్‌ను తీసుకురావడం సాధారణం. విదేశాల నుంచి తెల్ల చర్మం ఉన్న మోడల్స్‌ను ఎంపిక చేసేవారు, ఎందుకంటే అప్పటి హీరోయిన్లు ఇలాంటి గ్లామరస్ సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. స్టార్ హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్ చేయడానికి ముందుకు వస్తున్నారు. రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండటం, క్రేజ్ పెరగడం వంటివి ఈ మార్పుకు కారణాలు. ఈ జాబితాలోకి తాజాగా శ్రీలీల కూడా చేరిపోయిందని వార్తలు వస్తున్నాయి.

